సిరా న్యూస్,విజయవాడ;
విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే సృజనా చౌదరి బుధవారం నాడు ఇంద్రకీలాద్రిలోని దుర్గమ్మ దర్శనం చేసుకున్నారు.అయనకు ఆలయ కార్యనిర్వహణాధికారి కేస్ రామారావు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. వేద పండితులు వేదాశీర్వచనం చేసి అమ్మవారి ప్రసాదములు, శేషవస్త్రం, చిత్రపటం అందజేశారు. తరువాత అయన స్వామివారి ఆలయం చేరుకొని, స్వామి వారి దర్శనం చేసుకున్నారు.
మహమండపం 4 వ అంతస్తు చేరుకొని, ఈవో కార్యాలయంలో ఆలయ అభివృద్ధి, మాస్టర్ ప్లాన్ పై ఈవో, ఆలయ అధికారులతో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా ఆలయ ఈవో మాట్లాడుతూ మాస్టర్ ప్లాన్ లో అంశాలను వివరించారు.
ఎమ్మెల్యే మాట్లాడుతూ దుర్గమ్మ దర్శనం అయ్యాక ఈవో రామారావు, అధికారులతో కలిసి దుర్గ గుడి లో మౌలిక వసతులు పై చర్చించటం జరిగింది. దుర్గ గుడి లో అభివృద్ధి, సమస్యల పరిష్కారం కోసం చర్చలు జరిగాయి. దుర్గ గుడి నీ పూర్తి స్థాయిలో అభివృధ్ధి చేయాల్సిన అవసరం ఉంది. త్వరలో మరొక సమావేశంలో ఆర్ధిక పరిస్థితి మరియు ఇతర విషయముల పై చర్చించి, ఆలయ అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు.