సిరాన్యూస్, ఆదిలాబాద్
పేదల పెన్నిధి చిలుకూరి రామచంద్రారెడ్డి : డీసీసీబీ ఛైర్మన్ అడ్డి భోజారెడ్డి
* ఘనంగా సీఆర్ఆర్ ప్రథమ వర్దంతి
* కంది శ్రీనివాస రెడ్డి క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ శ్రేణుల ఘన నివాళి
మాజీ మంత్రిగా, ఎమ్మెల్యేగా జిల్లాకు ఎనలేని సేవలందించిన మహనీయుడు స్వర్గీయ చిలుకూరి రామచంద్రారెడ్డి పేదల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని కాంగ్రెస్ నాయకులు, డీసీసీబీ ఛైర్మన్ అడ్డి భోజారెడ్డి అన్నారు. శనివారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కంది శ్రీనివాస రెడ్డి క్యాంపు కార్యాలయంలో సీఆర్ఆర్ ప్రథమ వర్దంతిని ఘనంగా నిర్వహించారు. ఈసందర్బంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈసందర్బంగా డీసీసీబీ ఛైర్మన్ అడ్డి భోజారెడ్డి మాట్లాడుతూ నిరుపేదలకు రిమ్స్ ఆసుపత్రి నిర్మాణం ఆయన హయాంలోనే జరిగిందన్నారు.జిల్లాలో మత్తడి వాగు లాంటి అనేక ప్రాజెక్టులు ,రోడ్లు,నిరుపేదలకు ఇండ్లు కట్టించిన పేదదల పెన్నిధి స్వర్గీయ చిలుకూరి రామచంద్రారెడ్డి అని కొనియాడారు. సీఆర్ఆర్ పేదల గుండెల్లో గూడు కట్టుకున్న నేత అని మాజీ మున్సిపల్ చైర్మన్ దిగంబర్ రావు పాటిల్ అన్నారు. తాను నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి పని చేసిన మహనీయుడు సీఆర్ఆర్ అని ఐఎన్ టీయూసి జిల్లా అధ్యక్షులు మునిగెల నర్సింగ్ అన్నారు.పేదల పక్షాన నిలబడ్డ నాయకుడన్నారు.ఎన్నికల సమయాలలో నాయకులకు కార్యకర్తలకు చక్కటి దిశానిర్దేశం చేసేవారని గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ సీనియర్ నాయకులు గిమ్మ సంతోష్, కౌన్సిలర్లు రామ్ కుమార్,జాఫర్ అహ్మద్,మున్సిపల్ కో.ఆప్షన్ మెంబర్ ఇజ్జగిరి సంజయ్ కుమార్, మాజీ ఎంపీటీసీ బిక్కి గంగాధర్,ముడుపు ప్రశాంత్ రెడ్డి, ఎం.ఏ షకీల్, డేరా కృష్ణ రెడ్డి, అల్లూరి భూమ రెడ్డి, తిప్పిరెడ్డి విట్టల్ రెడ్డి, మంచాల మల్లయ్య,రాహుల సోమన్న,ఎం.ఏ కయ్యుమ్, సమీర్ అహ్మద్, మహేందర్,రమేష్, ప్రకాష్ మున్నా,మహమూద్, దర్శనాల చంటి, మహిళా నాయకురాళ్లు ప్రేమిల, జబీనా ,లత, సోనియా, శ్రీలేఖ ఆదివాసీ ,ఖమర్ బేగం, తదితరులు పాల్గొన్నారు.