సిరాన్యూస్, సైదాపూర్
పారిశుద్ధ్య నిర్వహణకు ప్రాధాన్యత : కార్యదర్శి పొరెడ్డి నరేందర్ రెడ్డి
గ్రామంలో పారిశుద్ధ్య నిర్మూలనకు మొదటి ప్రాధాన్యత ఇస్తున్నట్లు వెన్నంపల్లి పంచాయతీ కార్యదర్శి పొరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు. శనివారం సైదాపూర్ మండలం వెన్నంపల్లి గ్రామంలో గ్రామపంచాయితీ కార్మిక సిబ్బందితో కలిసి శనివారం పారిశుద్ధ్య నిర్మూలన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో ఉన్న మంచినీటి ట్యాంక్, మురికి కాలువలు శుభ్రం చేయించమన్నారు. వర్షాలు కురిసిన అనంతరం గ్రామాల్లో డెంగ్యూ, మలేరియా, అతిసారవ్యాధుల బారిన పడకుండా ఉండాలంటే గ్రామాన్ని ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ కార్మిక సిబ్బంది మొలుగూరి సదయ్య, మొలుగూరి తిరుపతి, పైడిపల్లి కుమార్ పాల్గొన్నారు.