సిరా న్యూస్,రాజమండ్రి;
తూర్పుగోదావరి జిల్లాలో భారీ వర్షాలతో కాలువలు ఉప్పోంగుతున్నాయి. 12 వేల హెక్టార్లలో వరి పంట ముంపు కు గురయింది. శనివారం నాడు జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలకు సెలవు ప్రకటించారు. ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద నుంచి సముద్రంలోకి మూడు లక్షల 46 వేల క్యూసెక్కుల జలాలు విడుదలచేసారు. ఏజెన్సీలోని పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. రాజనగరం నియోజకవర్గం సీతానగరం మండలంలో మిర్తిపాడు బొబ్బిలంక గ్రామాల మధ్య వంతెన కొట్టుకుపోయింది.శనివారం ఉదయానికి వర్షాలు స్వల్పంగా తగ్గాయి. మరో రెండు రోజులపాటు అప్రమత్తంగా ఉండాలని అధికారి యంత్రాంగం సూచించింది