పెరుగుతున్న గోదావరి నీటి మట్టం

భద్రాద్రి కొత్తగూడెం;
భద్రాచలం వద్ద గోదావరి వరద నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. ..30.5 అడుగుల వద్దకు చేరింది. గత వారం రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి.దీనితో జలాశయాలు పూర్తి స్థాయిలో నిండు కుంటున్నాయి.మొన్నటి వరకు 10 అడుగుల వద్ద ఉన్న గోదావరి ఎగువ నుండి వస్తున్న వరద నీటితో స్వల్పంగా గోదావరి వద్ద వరద నీటి మట్టం పెరుగుతుంది. గోదావరి నది స్నానఘట్టాల వరకు వరద నీరు వచ్చి చేరింది.ఇసుక తిన్నెలు అన్ని వరద నీటి లో మునిగాయి.ఈరోజు ఉదయం 31 అడుగుల వద్దకు చేరి ప్రవహిస్తున్న గోదావరి వరద నీరు.స్నానఘట్టాల వరకు వరద నీరు వచ్చి చేరింది.
చర్ల మండలం లోని తాలిపేరు ప్రాజెక్టు కు ఎగువన ఛత్తీస్ ఘడ్ లో కురుస్తున్న భారీ వర్షాలకు తాలిపేరు ప్రాజెక్టు జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరడంతో శనివారం ఉదయం ప్రాజెక్టు 20 గేట్లను ఎత్తి 66,900 క్యూసెక్కుల వరదనీరు దిగువకు విడుదల చేసారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *