సిరాన్యూస్,ఓదెల
ఆకుల సాంబయ్య కుటుంబానికి పరామర్శ: జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధుకర్
పెద్దపల్లి జిల్లా ఓదెల గ్రామ మాజీ సర్పంచ్ ఆకుల మహేందర్ నాన్న ఆకుల సాంబయ్య ఇటీవల మృతి చెందారు. ఈవిషయం తెలుసుకున్న పెద్దపల్లి జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ పుట్ట మధుకర్ సోమవారం వారి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం వారి చిత్రపటానికి పూలు వేసి నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమంలో నాయకులు గుజ్జుల రాజిరెడ్డి, బీఆర్ఎస్ నాయకులు పోలోజు రమేష్ , నరేష్ , శ్రావణ్ , డాక్టర్ సతీష్, బోయ సదానందం కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.