మూసిలో జలకళ

సిరా న్యూస్,నల్గోండ;
నల్లగొండ జిల్లా పరిధిలోని “మూసి ప్రాజెక్టు” జలకళను సంతరించుకుంది. హైదరాబాద్ మహానగరం సహా మూసి పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో మూసి నది పోటెత్తింది. ఇక మూసి ప్రాజెక్టుకి 2,235 క్యూసెక్కుల వరద నీరు ఇన్ఫ్లో రూపంలో వస్తుండగా.. కేవలం 68 క్యూసెక్కులను అవుట్ ఫ్లో రూపంలో వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 645 అడుగులకు గాను.. ప్రస్తుతం 641.10 అడుగులుగా ఉంది. అలాగే.. ప్రాజెక్టు పూర్తి నీటి నిలువ సామర్థ్యం 4.46 టీఎంసీలుగా ఉండగా.. ప్రజెంట్ 3.47 టీఎంసీలుగా ఉంది. ఎకో ప్రాంతాల్లో ఇదే రకంగా భారీ వర్షాలు కురిస్తే.. ఒకటి రెండు రోజుల్లోనే మూసీ నది నిండుకుండ లాగా దర్శనమివ్వనుంది..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *