BJP Patange Brahmanandam: గెలుపే లక్ష్యంగా పనిచేయాలి : బీజేపీ జిల్లా అధ్య‌క్షులు పతంగే బ్రహ్మానందం

సిరాన్యూస్‌, నేరడిగొండ
గెలుపే లక్ష్యంగా పనిచేయాలి : బీజేపీ జిల్లా అధ్య‌క్షులు పతంగే బ్రహ్మానందం

వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు పనిచేయాలని అదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు పతంగే బ్రహ్మానందం అన్నారు. మంగళవారం ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండల కేంద్రంలో మండల అధ్యక్షుడు సాబ్లే సంతోష్ సింగ్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన మండల కార్యవర్గ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. నాయకులెప్పుడు కూడా ప్రజల్లో ఉండాలని, ప్రజల సమస్యలను తెలుసుకొని వాటి పరిష్కారం కోసం పోరాడాలని అన్నారు. అలాయితేనే ప్రజలు ఆదరిస్తారని అన్నారు. ఈ సమావేశంలో ప్రజా సమస్యలపై పలు రాజకీయ తీర్మానాలు ప్రవేశపెట్టారు. పోడు భూములకు పట్టాలు, డిగ్రీ కళాశాల ఏర్పాటు,గ్రామాలకు రోడ్డు సౌకర్యం, కొత్త పెన్షన్లు, నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు, నూతన రేషన్ కార్డులు, కుంటాల జలపాత అభివృద్ధి, రైతు భీమా, మండల కేంద్రంలో మరుగుదొడ్ల నిర్మాణం వంటి తీర్మానాలు ప్రవేశపెట్టగా కార్యవర్గ సభ్యులు తమ హర్షధ్వానాలతో ఏకగ్రీవంగా ఆమోదించారు. తీర్మానంలో పేర్కొన్న ప్రజా సమస్యలపై దశలవారీగా పోరాటం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో బోథ్ అసెంబ్లీ కన్వీనర్ బాబారావ్ పటేల్, జిల్లా ఉపాధ్యక్షుడు మాధవ్ రావ్ ఆమ్టే, బీజేపీ మండల ప్రధాన కార్యదర్శులు ప్రవీణ్, రాఘవులు, రాజశేఖర్, నాయకులు నారాయణ్ సింగ్, రాములు, కమల్ సింగ్, నారాయణ,పరశురాం, ప్రేమ్ సింగ్, వెంకటేష్, లక్ష్మణ్, భీం రావ్, సురేష్, పృథ్వీరాజ్, ఉత్తం, రంజిత్, అశోక్, వంశీ, భోజన్న, విజయ్, జమీర్, సుంగు, ఇందల్, బాబులాల్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *