సిరా న్యూస్,హైదరాబాద్;
తెలంగాణలో వర్షాలు వరదల ప్రభావంపై జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సమీక్ష నిర్వహించారు.. మరో మూడు రోజులు వర్షాలు ఉన్నందున్న అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రాణ,ఆస్తి నష్టం కలగకుండా.. పునరావాస కేంద్రాల ఏర్పాటుపై చర్యలు తీసుకోవాలన్నారు. చెరువులు,కుంటలు తెగకుండా ముందు జాగ్రత్తలు చేపట్టాలని చెప్పారు. జిల్లాల్లో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేయాలని,భద్రాద్రి. ములుగు జిల్లాల్లో ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలను మోహరించాలని అధికారులకు సీఎస్ ఆదేశాలు జారీ చేశారు.