Nirmal Excise Department: సీజ్ చేసిన వాహనాలకు బహిరంగ వేలం

సిరాన్యూస్‌, నిర్మ‌ల్‌
సీజ్ చేసిన వాహనాలకు బహిరంగ వేలం

ఆదిలాబాద్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ ఆదేశాల మేరకు నిర్మ‌ల్‌ జిల్లా మద్యపాన నిషేధ అధికారి ఎండి రజాక్ సమక్షంలో ఈనెల 25న 26 వాహనాలకు నిర్మల్ జిల్లా కేంద్రంలో బ‌హిరంగం వేలం నిర్వ‌హిస్తున్న‌ట్లు స్టేషన్ హౌస్ ఆఫీసర్ తెలిపారు. వివిధ ఎక్సైజ్ కేసులలో పట్టుబడిన ద్విచక్ర వాహనాలు 18, మహేంద్ర బొలెరో 1, కార్లు 3, ప్యాసింజర్ ఆటోలు 3, ట్రాలీ ఆటో 1, మొత్తం వాహనాలు 26ల‌ను గురువారం ఉదయం 10 గంటలకు బహిరంగ వేలం నిర్వ‌హిస్తున్న‌ట్లు తెలిపారు. ఆసక్తి గ‌ల‌వారు డిపాజిట్ చెల్లించి వేలం పాటలో పాల్గొనాల‌ని పేర్కొన్నారు. మ‌రిన్ని వివ‌రాల కోసం ఫోన్ నెంబర్ 8712658791, 99 66 66891 సంప్ర‌దించాల‌ని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *