సిరా న్యూస్,మైలవరం;
ఇబ్రహీంపట్నంలో విషాదం నెలకొంది. నీటి కాలువలో పడి మూడేళ్ల బాలుడు మృతి చెందాడు. ఇంటి ముందు ఆడుకుంటున్న మూడేళ్ల సిద్ధార్థ నాయక్ (3) ప్రమాదవశాత్తు కాలువలో పడి మృతి చెందాడు.
అప్పటివరకు కళ్లముందే ఆడుకుంటున్న ఆ బాలుడు ఒక్కసారిగా కనబడకపోయేసరిగా తల్లిదండ్రులు ఖంగుతిన్నారు. బాలుడి కోసం వెతకటం ప్రారంభించగా.. ఇంటి సమీపంలోని కాలువలో మృతి చెంది ఉన్న ఘటన.. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో జరిగింది. మూడేళ్ల సిద్ధార్థ నాయక్ ఆడుకుంటుండగా.. ప్రమాదవశాత్తు తమ ఇంటి సమీపంలోని కాలువలో పడి మరణించాడు. ఈ ఘటన పై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇబ్రహీంపట్నంలోని కొండపల్లి కిల్లా రోడ్లు నివాసం ఉంటుంది భూక్యాకుమార్ లక్ష్మీ దంపతులు కొండపల్లి కిల్లా రోడ్డు సమీపంలో నివాసముంటున్నారు.
తల్లి లక్ష్మీ ఇంటిలో పనిచేసుకుంటూ ఉన్న సమయంలో మూడేళ్ల కుమారుడు సిద్ధార్థ నాయక్ ఇంటి ముందు ఆడుకుంటూ పక్కనే ఉన్నకాలువలో పడిపోయాడు.అప్పటివరకు ఇంటి ముందు ఆడుకుంటూ కనిపించకుండా పోయినటువంటి సిద్ధార్థ నాయక్ కోసం కుటుంబ సభ్యులు చుట్టుప్రక్కల గాలించిన ఎటువంటి ఫలితం లభించకపోతే స్థానిక ఇబ్రహీంపట్నం పోలీసులకు సమాచారం ఇవ్వగా సంఘటనా స్థలానికి చేరుకున్న ఇబ్రహీంపట్నం సీఐ ముత్యాల సత్యనారాయణ గాలింపు చర్యలు చేపట్టారు మొదట మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఇబ్రహీంపట్నం పోలీసులు బాబు మృతదేహాన్ని స్థానిక నిమ్రా కాలేజ్ గేటు ఎదురుగా కాలువలు కనుకున్నారు. కుటుంబ సభ్యులకు బాబు మృతదేహాన్ని అప్పగించగా గుండెలు పగిలేలా కుటుంబ సభ్యులు రోదించారు.