సిరాన్యూస్,భీమదేవరపల్లి
వ్యక్తిగత శుభ్రత పాటించాలి: డాక్టర్ మూతర్ రహమాన్
* నర్సింగాపూర్‌లో ఇంటింటా ఫీవర్ సర్వే
ప్రతి ఒక్కరూ వ్యక్తిగత శుభ్రత పాటించాలని డాక్టర్ మూతర్ రహమాన్ అన్నారు. భీమదేవరపల్లి మండలంలోని గట్ల నర్సింగాపూర్ గ్రామంలో పీహెచ్‌సీ వంగర వైద్య సిబ్బంది ఇంటింటికి ఫీవర్ సర్వే పరీక్షలు నిర్వహించి చికిత్స అందించారు.. అనంతరం గ్రామస్తులకు సీజనల్ వ్యాధుల పట్ల అవగాహన కల్పించారు. అనంతరం డాక్టర్ మూతర్ రహమాన్ మాట్లాడుతూ గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ వర్షాకాలంలో వచ్చే మలేరియా, టైఫాయిడ్ వంటి వ్యాధులు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పారు. ప్రతి ఒక్కరు వ్యక్తిగత శుభ్రతతో పాటు, తమ ఇంటి పరిసరాలను నిత్యం శుభ్రపరచుకోవాలని సూచించారు. పరిసర ప్రాంతాల్లో రోడ్డుపై కానీ నీరు నిలవకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీహెచ్ఓకే ఎల్ ఎన్ స్వామి, ఏఎన్ఎం స్వరూప, కే రాజమణి, ఎస్ సునీత, వసంత స్వరూప తదితరులు పాల్గొన్నారు.