సిరా న్యూస్,ఖమ్మం;
ఖమ్మం జిల్లా మధిరలో సెకండ్ హ్యాండ్ బైక్ షోరూమ్స్ పై పోలీసులు తనిఖీ నిర్వహించారు. సెకండ్ హ్యాండ్ షోరూమ్స్ లో దొంగ బైక్ లు కొంటున్నారునే సమాచారం మేరకు పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఇటీవల మధిర ప్రాంతంలో బైక్ దొంగతనాలు ఎక్కువగా జరుగుతుండడంతో పోలీసులు ఈ తనిఖీలు చేపట్టారు. ఎవరైనా దొంగ బండ్లు తీసుకొచ్చి అమ్మజూపితే తమకు సమాచారం ఇయ్యాలని లేదంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు .