సిరా న్యూస్,నెల్లూరు;
నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం పట్టణం జొన్నవాడ సెంటర్ లో పోలీసులమంటూ వృద్ధురాలిని బురిడీ కొట్టించి 20వేల రూపాయలు దుండగులు దోచుకెళ్లారు. బుచ్చి పట్టణంలో ని జొన్నవాడ సెంటర్లో సీతమ్మ అనే వృద్ధురాలు దొడ్ల డైరీ పార్లర్ పెట్టుకొని జీవనం సాగిస్తుంది. ఇద్దరు యువకులు మేము పోలీసులం మాకు మజ్జిగ, పాల ప్యాకెట్లు కావాలని ఆమెను నమ్మబలికారు. వృద్ధురాలు మజ్జిగ ప్యాకెట్లు ఇచ్చే క్రమంలో గల్లాలోని 20వేల రూపాయలు చాకచక్యంగా అపహరించుకొని వెళ్లారు. కాసేపటి తర్వాత గల్లా పెట్టను చూసి వృద్ధురాలు అవాక్కయింది. 20వేల రూపాయలు నగదు మాయమవడంతో తన కుమారుడికి సమాచారం అందించింది. సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.