తెలంగాణకు భారీగా పెరిగిన అప్పులు

సిరా న్యూస్,హైదరాబాద్;
తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తొలిసారిగా పూర్తిస్థాయి బడ్జెట్‌ను ఇవాళ అసెంబ్లీ ప్రవేశ పెట్టింది. ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క 2024 సంవత్సరానికి పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశ పెట్టారు. ఫిబ్రవరిలోనే బడ్జెట్ ప్రవేశ పెట్టాల్సి ఉన్నప్పటికీ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ తీసుకొచ్చారు. పూర్తిస్థాయిలో ఆర్థిక వనరులపై పట్టు లేదని, కేంద్రం నుంచి రావాల్సిన నిధుల వివరాలు తెలియాల్సి ఉన్నందున అప్పట్లో ఆ నిర్ణయం తీసుకున్నారు. ఈ మధ్యనే కేంద్రం కూడా పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశ పెట్టడంతో కేంద్రం నుంచి వచ్చే నిధులను బేస్ చేసుకొని ఇప్పుడు బడ్జెట్‌ను రూపకల్పన చేశారు. మొత్తం రూ.2,91,159 కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టారు. ‘ప్రత్యేక తెలంగాణ ఏర్పడితే కలలు సాకారమవుతాయని సుదీర్ఘ కాలం ఉద్యమించారు. వారి ఆవేదన గుర్తించి యూపీఏ ప్రభుత్వం ప్రత్యేక రాష్టాన్ని ఇచ్చింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత దశాబ్ధి కాలంలో పురోభివవృద్ధి ఆశించిన స్థాయిలో జరగలేదు. గత పాలకులు అన్ని రంగాల్లో పూర్తిగా విఫలమయ్యారు. ప్రజల సంక్షేమాన్ని కూడా పట్టించుకోలేదు. రాష్ట్రాన్ని అప్పులు పాలు చేశారు. రాష్ట్ర ఆవిర్భావ సమయానికి ఉన్న 77 వేల కోట్ల రూపాయల అప్పు… ఆరు లక్ష 71వేల 750 కోట్లకు చేరింది.’ అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు.
బడ్జెట్ సమగ్ర స్వరూపం ఇదే
మొత్తం బడ్జెట్‌- 2,91,159
రెవెన్యూ వ్యయం – 2,20,945 కోట్లు
మూల ధన వ్యయం – 33,487
‘తప్పుడు నిర్ణయాలు – నో రిజల్ట్స్’
‘గత పాలకులు తీసుకున్న తప్పుడు నిర్ణయాల కారణంగా సాగునీటి ప్రాజెక్టులు ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు. అవినీతి సొమ్మును ఏ కాల్వల ద్వారా పారించాలని గత పాలకులు పని చేశారు. దీంతో మన నీళ్లను మనం సమర్థంగా ఉపయోగించుకోలేకపోయాం. దీన్ని సరిదిద్దేందుకు ఈసారి నిధులు కేటాయించాం. అప్పులు పెరగడంతో రాష్ట్ర ఆర్థిక స్థితి ప్రమాదకర స్థాయికి చేరుకుంది. సొంత జాగీరులా మార్చేయడంతో ఇబ్బందులు పడుతున్నాం. రాష్ట్రం ఏర్పడే నాటికి పరిపుష్టిగా ఉన్న రాష్ట్రాన్ని అప్పులు కుప్పగా మార్చేశారు. ఉద్యోగులకు సరైన టైంలో జీతాలు ఇవ్వలేకపోతున్నాం. వాళ్లే కాకుండా ప్రభుత్వ పథకాలపై ఆధారపడిన వాళ్లు కూడా ఇబ్బంది పడుతున్నారు.’ అని భట్టి పేర్కొన్నారు.
వివిధ రంగాలకు చేసిన కేటాయింపులు
ప్రభుత్వ రంగం
కేటాయించిన నిధులు కోట్లలో
1 వ్యవసాయ రంగం 72,659
2 నీటిపారుదల రంగం 22,301
3 విద్యా రంగం 21,292
4 వైద్య ఆరోగ్య రంగం 11,468
5 పారిశ్రామిక రంగం 2,762
6 ఐటీ అభివృద్ధి కోసం 774
7 స్త్రీ శిశు సంక్షేమ 2736
8 విద్యుత్ రంగం 16,410
9 హార్టీకల్చర్‌- ఆయిల్ పామ్ సాగు 737
10 పశు సంవర్థక రంగం 1980
11 ప్రజాపంపిణీ వ్యవస్థ 3836
12 పంచాయతీరాజ్‌ -గ్రామీణాభివృద్ధి 29,816
13 హైదరాబాద్ నగరాభివృద్ధి 10,000
14 రీజనల్ రింగ్ రోడ్ 1525
15 ఎస్సీ సంక్షేమం 33,124
16 ఎస్టీ సంక్షేమం 17,056
17 మైనార్టీ సంక్షేమం 3,003
18 బీసీ సంక్షేమం 9,200
19 అడవులు పర్యవరణ రక్షణ రంగం 1,064
20 శాంతి భద్రతలు 9,564
21 రోడ్లు, భవనాలకు 5,790

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *