సిరాన్యూస్, ఆదిలాబాద్
రాష్ట్ర బడ్జెట్ ప్రజా సంక్షేమ బడ్జెట్ :కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు లోక ప్రవీణ్ రెడ్డి
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా శాసనసభలో రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజా సంక్షేమ బడ్జెట్ అని ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు లోక ప్రవీణ్ రెడ్డి హర్షం గురువారం వ్యక్తం చేశారు. తెలంగాణ పూర్తిస్థాయి బడ్జెట్ 2,91,291కోట్ల లో అన్ని వర్గాల ప్రజల సంక్షేమంతో పాటు ప్రజల అవసరాలను విద్యారంగం, వైద్యం, ఇరిగేషన్ వంటి వాటికి ప్రాధాన్యతనిస్తూనే మహాలక్ష్మి పథకానికి సైతం 723 కోట్ల రూపాయలను, గృహ జ్యోతి 2418 కోట్లను, కేటాయించి ప్రజలపై తమకున్న ఆసక్తిని గుర్తు చేసిందని పేర్కొన్నారు.ముఖ్యంగా రైతులకు పెద్దపీట వేస్తూ వారికి అన్ని విధాలుగా ఆదుకునేందుకు తెలంగాణ రాష్ట్ర బడ్జెట్లో ప్రత్యేక ప్రాధాన్యతను ఇచ్చిందని అన్నారు. అదేవిధంగా సంక్షేమ శాఖలకు సరైన బడ్జెట్ కేటాయించి ప్రజలకు వ్యక్తిగత రుణాలు సబ్సిడీ రుణాలు ఇచ్చేందుకు అవకాశం కల్పించిందని పేర్కొన్నారు .ఇంకా రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం బడ్జెట్లో అత్యధిక ప్రాధాన్యతను ఇస్తుందని ప్రతిపక్షాలు ఈ బడ్జెట్ ను ఎంతగా విమర్శించిన, ఆరోపనలు చేసిన ప్రజలు మాత్రం ఆమోదయోగంగా ఉన్నట్లు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని అన్నారు.