సిరా న్యూస్, సైదాపూర్:
పిల్లలకు పౌష్టికాహారాన్ని అందించాలి: మండల మెడికల్ ఆఫీసర్ సపతి సౌమ్య
గర్భిణీలు, పిల్లలకు సరైన పోషకాహారం తీసుకునేలా అంగన్వాడీ కేంద్రాలు సంపూర్ణ ఆరోగ్యంపై అవగాహన కల్పించాలని సైదాపూర్ మండల మెడికల్ ఆఫీసర్ సపతి సౌమ్య అన్నారు. సైదాపూర్ మండలంలో ప్రతి శుక్రవారం రోజు జరిగే సభలో ఆమె మాట్లాడుతూ గర్భిణీలు, అంగన్వాడీ పిల్లలు అధిక పోషణ విలువలు కలిగిన ఆహారాన్ని మాత్రమే తినాలన్నారు. సరైన ఆహారం తీసుకోవడం వల్ల అంగన్వాడీ పిల్లల ఎదుగుదలలో, గర్భిణీల ఆరోగ్య విషయాలపై తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. గర్భిణీలు శరీరానికి కావాల్సిన ఐరన్ ఆహారం తీసుకోవాలని ఐరన్ లోపం వ్యాధుల బారిన పడకుండా, సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ఇంటి పరిసరాల చుట్టూ నీరు నిల్వకుండా పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ప్రభుత్వం తరపున అందించే అంగన్వాడీ మరియు ఆశవర్కర్ల సేవలను వినియోగించుకోవాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో పల్లె దవాఖాన డాక్టర్ బి.కృష్ణకుమార్, జీడిపెల్లి కృష్ణరావు, ఐ సి డి ఎస్ సూపర్వైజర్ జ్యోతి, పంచాయతీ సెక్రటరీ పోరెడ్డి నరేందర్ రెడ్డి, అంగన్వాడీ టీచర్స్, ఆశ వర్కర్స్, గర్భిణీలు, పిల్లలు, కిషోర బాలికలు తదితరులు పాల్గొన్నారు.