సిరా న్యూస్,వికారాబాద్;
వికారాబాద్ మున్సపల్ పరిదిలోని 31వ వార్డ్ శివరాంనగర్ కాలనిలో పోచ్చమ్మ దేవాలయానికి కాలని వాసులు, భక్తులు బుధవారం ఘనంగా బోనాలు నిర్వహించారు. అమ్మవార్ల దర్శనం కోసం కాలని వాసులతో పాటు చుట్టుపక్కలనుంచి భక్తులు భారీగా రావడంతో ఆలయ ప్రాంగణం సందడిగా మారిది. పోచమ్మ దేవాలయంలో పూజలు చేసి ఆలయ గర్భగుడిలో వెలిసిన అమ్మవార్లకు కుంకుమార్చన పూజలతో ప్రత్యేక పూజలు, చేసి తమ మొక్కులు తీర్చుకున్నారు. కార్యక్రమంలో జోగిని పావని,శివసత్తుల పునకాలు,పోతరాజుల విన్యాసాలతో అకర్శనియంగా కనిపించాయి. ఈ కార్యక్రమంలో శివరాంనగర్ కాలనీవాసులు మరియు కాలనీ కౌన్సిలర్ మాలే గాయత్రి లక్ష్మణ్ ,నాయకులు బుస శ్రీకాంత్ కన్నయ్య సంతోష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.