సిరా న్యూస్,అనంతపురం;
బ్రహ్మసముద్రం మండల పరిధిలోని వెస్ట్ కోడిపల్లి గ్రామానికి చెందిన రవిచంద్ర, తిమ్మయ్య అనే వ్యక్తులు వ్యవసాయ పనుల నిమిత్తం పొలం పనులు చేస్తుండగా మొక్కజొన్న పొలం నుండి ఒక్కసారిగా రవిచంద్ర లపై ఎలుగుబంటి దాడి చేసింది. రవి చంద్ర కేకలు వేయడం తో పక్కనే ఉన్న తిమ్మయ్య అక్కడికి వచ్చి కాపాడే ప్రయత్నం లో ఎలుగుబంటి అతడి పై కూడ దాడిడీ చేసింది.
వారిద్దరికి తీవ్ర గాయాలు కావడం తో ప్రస్తుతం కళ్యాణదుర్గం ప్రభుత్వం హాస్పిటల్ ప్రథమ చికిత్స అందజేసి, మెరుగైన చికిత్స కోసం అనంతపురం తరలించారు.