సిరాన్యూస్, భీమదేవరపల్లి
రోడ్డు పై వరి నాట్లు వేసి నరహరితండా గ్రామస్తులు నిరసన
చిన్నపాటి వర్షానికే రోడ్డు బురదమయంగా మారడంతో అందులో నాటు వేసి శుక్రవారంహనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూర్ పరిధిలోని నరహరితండా గ్రామస్తులు నిరసన తెలిపారు. ఈసందర్బంగా వారు మాట్లాడుతూ తండా నుండి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న ముల్కనూర్ వెళ్లడానికి రోడ్డు సరిగా లేక నానా తిప్పలు పడుతున్నామని, గత ప్రభుత్వంలో అధికారులకు ఎన్నిసార్లు విన్నవించిన తమ గ్రామానికి రోడ్డు సౌకర్యం మెరుగుపడలేదని వాపోయారు. మిషన్ భగీరథ నీరు కూడా రావడంలేదని తాగడానికి, వాడుకోవడానికి నీళ్లు లేక ఇబ్బందులు పడుతున్నామన్నారు. తండాలో డ్రైనేజీ వ్యవస్థ లేక దోమలు చెలరేగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం అయినా గిరిజన తండాలపై ప్రత్యేక దృష్టి పెట్టి తమ తండాకు బీటీ రోడ్డు, మంచినీటి సౌకర్యం కల్పించి, డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.