సిరాన్యూస్, బోథ్
టీజీవీపీ 12 ఆవిర్బావ పోస్టర్ ఆవిష్కరణ: బోథ్ నియోజకవర్గ కన్వీనర్ గొర్ల నరేందర్ యాదవ్
విద్యారంగంలో గల సమస్యలను పరిష్కరించడంలో తెలంగాణ విద్యార్థి పరిషత్ పోరాటం చేస్తుందని టీజీవీపీ బోథ్ నియోజకవర్గ కన్వీనర్ గొర్ల నరేందర్ యాదవ్ అన్నారు. శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండల కేంద్రంలో టీజీవీపీ 12 ఆవిర్బావ దినోత్సవ గోడపత్రాలను విడుదల చేశారు. ఈసందర్బంగా విద్యార్థి బోథ్ నియోజకవర్గ కన్వీనర్ గొర్ల నరేందర్ యాదవ్ , బోథ్ కో కన్వీనర్ ఉ లెంగ్గుల సతీష్ లు మాట్లాడారు. తెలంగాణ సాధనే లక్ష్యంగా సాధనే లక్ష్యంగా ఏర్పడ్డ టీజీవిపి అనాతి కాలంలోనే తెలంగాణలో నే ప్రశ్నించే గొంతుక గా పేరు సంపాదించిందన్నారు. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత తెలంగాణ రాష్ట్రం విద్యార్థుల సమస్యల పరిష్కారమే ఏ కైక జెండాగా పని చేస్తుందని తెలిపారు. ఈకార్యక్రమంలో వంశీ, రాజు, కృష్ణ, రాము, అజయ్, శీను.. విజయ్ తదితర టీజీవీపీ కార్యకార్తలు పాల్గొన్నారు