సిరాన్యూస్,ఆదిలాబాద్
అమర జవాన్లను స్మరించుకోవాలి: బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు అలాల్ అజయ్
దేశం కోసం అమరులైన జవాన్ల త్యాగాలను ప్రతి ఒక్కరు స్మరించుకోవాలని బీఆర్ఎస్ ఆదిలాబాద్ పట్టణ అధ్యక్షులు అలాల్ అజయ్ అన్నారు. శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని అమరవీరుల స్థూపం వద్ద బీఆర్ఎస్ నాయకులు పుష్పాంజలి ఘటించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడారు. దేశ రక్షణలో అమరులైన సైనికుల త్యాగాలు మరవలేనివని పేర్కొన్నారు. కార్యక్రమంలో నేతలు సాజిదోద్దీన్, ప్రకాష్, పవన్ నాయక్, శ్రీను తదితరులు పాల్గొన్నారు.