నది ఒడ్డున ప్రజలు అప్రమత్తగా ఉండాలి

ఎమ్మెల్యే. డాక్టర్. బి.వి. జయనేశ్వర్ రెడ్డి వెల్లడి

సిరా న్యూస్,ఎమ్మిగనూరు;
ఎమ్మిగనూరు నియోజవర్గంలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎమ్మెల్యే. డాక్టర్. బి. వి. జయనాగేశ్వర్ రెడ్డి ఎమ్మిగనూరు నియోజకవర్గం నందవరం మండలంలో విధులు నిర్వహిస్తున్న అధికారులకు , ప్రజాప్రతినిధులకు సూచన.ఈరోజు మనకు తుంగభద్ర డ్యాం నుండి 90 వేల క్యూసెక్కుల నీటిని 28 గేట్ల ద్వారా వదిలారని తుంగభద్ర డాం అధికారులు తెలిపిన మేరకు ముందు జాగ్రత్తగా చర్యలో భాగంగా మననియోజకవర్గం లోని నది పరివాహక ప్రాంతమైన నందవరం మండలంలోని గ్రామాలలో అధికారులకు, ప్రజా ప్రతినిధులకు మీ గ్రామాలలో ప్రజలను అప్రమత్తం చేస్తూ దండోరా వేయించవలసిందిగా. ఎమ్మెల్యే. డాక్టర్. బి. వి. జయనగేశ్వర్ రెడ్డి ఆదేశించారు.
నదీ పరివాహ గ్రామాలు అనగా నదీ కైరవడి,గంగవరము, జోహారాపురం,పెద్దకొత్తిని, చిన్నకొత్తిలి, నాగలదిన్నె, గురజాల, రాయచోటి గ్రామాలలో ప్రజలు అప్రమత్తంగా ఉంటూ తమ పశువులను ఇంటి దగ్గరే ఉండేలా చూసుకొని, ఇంటి నుండి చిన్న పిల్లలు ఈతకు, పెద్దలు ఆడవారు బట్టలు ఉతకడానికి వెళ్లకుండా ఉండవలసిందిగా మనవి. ఈ విషయాలను ఆ గ్రామాలకు సంబంధించిన విఆర్వోలు, పంచాయతి సెక్రటరీలు, సర్పంచులు, గ్రామ పెద్దలు దండోరా వేయించాల్సిందిగా ఆదేశించడం అయినది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *