నంద్యాల పట్టణంలో నంబర్ ప్లేట్ లేని వాహనాలపై స్పెషల్ డ్రైవ్ నిర్వహణ…

జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా
సిరా న్యూస్,నంద్యాల;
పట్టణంలో నంబర్ ప్లేట్ లేని వాహనాలపై గత రెండు రోజులుగా ప్రత్యేక డ్రైవ్ నిర్వహించడం జరిగింది.ఇందులో భాగంగా నంద్యాల పట్టణ పరిధిలో ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ఇస్మాయిల్ ఆధ్వర్యంలో ఈ డ్రైవ్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా నంద్యాల పట్టణంలో నంబర్ ప్లేట్ లేని 52 మోటార్ సైకిళ్ళును సీజ్ చేసి మోటార్ వెహికల్ చట్టం ప్రకారం జరిమాన విధించడం జరిగింది. అనంతరం వారు సదరు వాహనానికి సంబంధించిన నంబర్ ప్లేట్ తెచ్చిన తర్వాత వాహన ధ్రువపత్రాలను పరిశీలించి సదరు వాహనాలను సంబంధిత వ్యక్తులకు అప్పగించడం జరిగిందని ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ఇస్మాయిల్ తెలియజేశారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా మాట్లాడుతూ నంద్యాల జిల్లా అంతట ఈ స్పెషల్ డ్రైవర్ నిర్వహించడం జరుగుతుందని కావున ప్రతి ఒక్కరూ వారి వెహికల్ కు సంబంధించిన నంబర్ ప్లేట్ కలిగి ఉండాలని మరియు మోటర్ వెహికల్ పై వెళ్లేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని మరియు ఫోర్ వీలర్ వాహనదారులు తప్పనిసరిగా సీట్ బెల్ట్ ధరించాలని మరియు రోడ్డు భద్రత నిబంధనలు, ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ సురక్షితంగా గమ్యం చేరాలని తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *