కస్టడీ పొడిగించిన అవెన్యూ కోర్టు
సిరా న్యూస్,న్యూ ఢిల్లీ;
కవితకు మరోసారి నిరాశే . మద్యం కుంభకోణంలో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవిత ఇప్పట్లో బయటకు వచ్చే సూచనలు కనిపించడం లేదు.ఈడీ, సీబీఐ వద్ద బలమైన సాక్ష్యాలు ఉండడంతో కవిత బెయిల్ పిటిషన్లు తిరస్కర ణకు గురవుతున్నాయని. తాజాగా ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు ఎమ్మెల్సీ కవిత జ్యుడీ షియల్ కస్టడీని పొడిగిస్తూ శుక్రవారం మరోసారి ఉత్తర్వు లు జారీ ఇచ్చింది.సీబీఐ కేసులో డీఫాల్ట్ బెయిల్ ఇవ్వాలని కోరుతూ కవిత వేసిన పిటిషన్ పై జులై 22న రౌస్ అవెన్యూ కోర్టు విచారణ చేపట్టింది. తదుపరి విచారణను ఆగస్టు 5కి వాయిదా వేసింది.