సిరాన్యూస్,సైదాపూర్
ప్రజా సమస్యలపైన ఉద్యమించండి: బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు ఎర్రబెల్లి సంపత్ రావు
* కేంద్ర ప్రభుత్వ పథకాలు గడపగడపకు తీసుకెళ్లాలి
ప్రజా సమస్యలపైన ఉద్యమించాలని బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు ఎర్రబెల్లి సంపత్ రావు అన్నారు. శుక్రవారం వెన్కేపల్లి – సైదాపూర్ మండల కేంద్రంలో మండల భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు కందుల శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన ముఖ్య కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు ఎర్రబెల్లి సంపత్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలను గడప,గడపకు తీసుకెళ్లాలని కార్యకర్తలకు సూచించారు. 6 గ్యారెంటీల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందని దుయ్యబట్టారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మండలంలో అత్యధిక సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పిటిసి స్థానాల్ని కైవసం చేసుకునే లక్ష్యంగా కార్యకర్తలు ఇప్పటినుండే ప్రణాళిక బద్ధంగా ముందుకు వెళ్లాలని దిశ,నిర్దేశం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా బీజేపీ శ్రేణులు సమిష్టిగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. అనంతరం మండల కార్యవర్గ సమావేశంలో రాజకీయ,వ్యవసాయ తీర్మానం ప్రవేశపెట్టి వాటిపైన చర్చించారు. బీజేపీ స్టేట్ కౌన్సిల్ మెంబర్ జంపాల సంతోష్ రాజకీయ తీర్మాణాన్ని ప్రవేశపెట్టారు. దానిని కూనమళ్ళ మొండయ్య ఆమోదించారు. ముచ్చటగా మూడవసారి ప్రధానిగా నరేంద్రమోడీ, రెండవసారి పార్లమెంట్ సభ్యులుగా బండి సంజయ్ కి కృతజ్ఞతలు తెలియజేశారు. మాజీ ఎంపీటీసీ జెల్ల మల్లేష్ ఎంపీటీసీల పదవి కాలం పూర్తయినా సందర్బంగా శాలువాలతో వారిని సత్కారించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శిలు గాజుల రమేష్, దంచనాల శ్రీనివాస్, బీజేవైఎం, ఓబీసీ మోర్చాల అధ్యక్షుడు పెరుమాండ్ల భరద్వాజ్, నెల్లి శ్రీనివాస్, సీనియర్ నాయకులు అనుమాండ్ల గోపాలరెడ్డి, ఆబ్బిడి వీరరాఘవరెడ్డి, హరి ప్రసాద్, కొలిపాక తిరుపతి, మునిపాల అశోక్, కిరణ్, నీర్ల సతీష్, సైదాపూర్ బూత్ అధ్యక్షులు వంగ సాగర్, నెల్లి చందు వివిధ అన్ని గ్రామాల బూత్ అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.