సిరాన్యూస్,సైదాపూర్
శ్రీనివాస్ కుటుంబాన్ని పరామర్శించిన మాజీ రాష్ట్ర హౌజ్ ఫెడ్ చైర్మన్ బొమ్మ శ్రీరామ్
సైదాపూర్ మండలం దుద్దెనపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మాజీ జడ్పీటీసీ గుండారపు శోభ శ్రీనివాస్ తల్లి ఇటీవల మృతి చెందారు. వారి కుటుంబాన్ని మాజీ రాష్ట్ర హౌజ్ ఫెడ్ చైర్మన్ బొమ్మ శ్రీరామ్ శుక్రవారం పరామర్శించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ కౌన్సిలర్ కోమటి స్వర్ణలత సత్యనారాయణ, మాజీ ఎంపీటీసీ చాడ చైతన్య కొండాల్ రెడ్డి, మాజీ పట్టణ అధ్యక్షుడు అక్కు శ్రీనివాస్, గ్రామశాఖ అధ్యక్షుడు తాళ్లపెళ్లి వెంకటేశం, యూత్ కాంగ్రెస్ నాయకులు పూదరి హరీష్ గౌడ్, బోనగిరి అనిల్, మాడెపు రాహుల్ తదితరులు పాల్గొన్నారు.