MLA Vedma Bojju Patel: సబ్బండ వర్గాల అభివృద్ధికి పెద్దపీట :ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్

సిరాన్యూస్,ఉట్నూర్
సబ్బండ వర్గాల అభివృద్ధికి పెద్దపీట :ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్
* కేసీఆర్ ఆర్ కేంద్ర బడ్జెట్ విషయంలో నోరెందుకు మెదపలేదు

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ సబ్బండ వర్గాల అభివృద్దే లక్ష్యంగా,పేదల సంక్షేమానికి పెద్దపీట వేసిందని ఖానాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే వెడ్మ బోజ్జు పటేల్ అన్నారు. శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఎస్సీ, ఎస్టీ ,బీసీ మైనారిటీ లకు ఆమోదయోగ్యమైన బడ్జెట్ ను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిందన్నారు.గత ప్రభుత్వం కంటే రెట్టింపు స్థాయిలో పేద బడుగు బలహీన వర్గాలకు సంక్షేమం కోసం బడ్జెట్ కేటాయింపులు జరిగాయని పేర్కొన్నారు.రూ.2,91,159 కోట్లతో రాష్ట్ర పూర్తిస్థాయి బడ్జెట్​ను శాసనసభలో ఆర్థికశాఖ మంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టారని అన్నారు. గత ప్రభుత్వం బడ్జెట్లో సాగునీటి రంగంలో కాళేశ్వరం ప్రాజెక్ట్ పేర ఇష్టారితిన నిధులు దుర్వినియోగం చేశారని ఆరోపించారు. బడ్జెట్ లో నియోజకవర్గంలోని కడెం ప్రాజెక్టు అభివృద్ధికి రూ.9.46 కోట్లు కేటాయించారని ఎమ్మెల్యే తెలిపారు. నాగోబా జాతర నిర్వహణకు రూ.1కోటి, సేవాలాల్ జయంతి నిర్వహణకు రూ. 2 కోట్లు, మేడారం జాతరకు 100 కోట్లు బడ్జెట్లో కేటాయించారన్నారు.ఇన్ని రోజులు అసెంబ్లీకి రాని మాజీ సిఎం కేసీఆర్ బడ్జెట్ ప్రజలకు ఆమోద యోగ్యంగా లేదని చెప్పడం,ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు.కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ విషయంలో కేసీఆర్ నోరు ఎందుకు మెదపలేదని సమాధానం చెప్పాలని ప్రశ్నించారు.గత 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ప్రజల పట్ల అహంకార ధోరణి ప్రదర్శించి కమిషన్ల కోసం రాష్ట్రాన్ని దోచుకున్నారని ఆరోపించారు నేడు అభివృద్ది చేస్తున్న ప్రభుత్వాన్ని బద్నాం చేయడానికి కుట్ర పన్నుతున్నారని పేర్కొన్నారు. బీజేపీ, బిఆర్ఎస్ మద్య చీకటి ఒప్పందం కుదిరిందా? అందుకే కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ పై మాట్లాడడం లేదా అనీ ప్రశ్నించారు. అనంతరం భద్రాచలం ఐటీడిఎ ఏపీఓ భీంరావ్ విధులు నిర్వహిస్తు ఇటీవల మృతి చెందగా వారి మృతి పట్ల రెండు నిముషాలు మౌనం పాటించి సంతాపం తెలిపారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

2 thoughts on “MLA Vedma Bojju Patel: సబ్బండ వర్గాల అభివృద్ధికి పెద్దపీట :ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *