సిరాన్యూస్,ఖానాపూర్ టౌన్
రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి.. మరొకరికి గాయాలు
రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరొకరికి గాయాలైన సంఘటన ఆర్మూర్ సిద్దుల గుట్ట వద్ద శుక్రవారం చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖానాపూర్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు సురేష్ సోదరుడు నరేష్ , మరొ వ్యక్తి నాగేష్‌లకు ఆర్మూర్ లో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నరేష్ మృతి చెందగా, నాగేష్ సీరియస్ గా ఉన్నట్లు తెలిసింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.