సిరా న్యూస్,జగిత్యాల;
మెట్పల్లి మండలం పెద్దాపూర్ గురుకులంలో 8వ తరగతి విద్యార్థి గణాధిత్య(13) అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే సిబ్బంది ఆసుపత్రి తరలిస్తుండగా విద్యార్థి మృతి చెందాడు. మరో ఇద్దరు విద్యార్థులు అస్వస్థతకు గురికావడంతో మెరుగైన చికిత్స కోసం నిజామాబాద్ ఆసుపత్రికి తరలించారు. సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని బాలుడి బంధువులు ఆరోపించారు. ఒక్కగానొక్క కుమారుడు మృతి చెందడంతో మహేశ్, లావణ్య దంపతులు విలపించిన తీరు అందరినీ కలిచివేసింది.