జగన్ ధర్నాకు సంఘీభావం ఎందుకు ?

వైఎస్ షర్మిలా రెడ్డి
సిరా న్యూస్,విజయవాడ;
కాంగ్రెస్ పార్టీ ఎందుకు రాలేదో సమాధానం చెప్పాలంటున్న జగన్ చేసిన ధర్నాకు సంఘీభావం ఎందుకు ప్రకటించాలని పిసిసి ఛీఫ్ షర్మిల రెడ్డి ప్రశ్నించారు.
పార్టీ ఉనికి కోసం ఢిల్లీలో కపట నాటకం ఆడినందుకా..? వ్యక్తిగత హత్యకు రాజకీయ రంగు పులిమినందుకా..? 5 ఏళ్లు బీజేపితో అక్రమ సంబందం పెట్టుకుని, విభజన హక్కులను, ప్రత్యేక హోదాను బీజేపీకి తాకట్టు పెట్టి,ఆఖరుకి మణిపూర్ ఘటనపై నోరెత్తని మీకు, ఉన్నట్లుండి అక్కడి పరిస్థితులు గుర్తుకు రావడం విడ్డూరమని అన్నారు.క్రిష్టియన్ అయి ఉండి క్రైస్తవులను ఊచకోత గురి చేసినా, నోరు మెదపకుండా విపక్షాలు పెట్టిన అవిశ్వాస తీర్మానంలో బీజేపీకే మద్దతు ఇచ్చారు కదా? వైఎస్సార్ వ్యతిరేకించిన మతతత్వ బీజేపికే జై కొట్టారు కదా? మణిపూర్ ఘటనపై కాంగ్రెస్ దేశవ్యాప్త ఉద్యమం చేస్తుంటే మీనుంచి వచ్చిందా సంఘీభావం? మీ నిరసనలో నిజం లేదని, స్వలాభం తప్పా. రాష్ట్రానికి ప్రయోజనం శూన్యమని తెలిసే కాంగ్రెస్ పార్టీ దూరంగా ఉందని అన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *