సిరాన్యూస్, కళ్యాణదుర్గం
కళ్యాణదుర్గం మున్సిపాలిటీలో సీసీ రోడ్డు సర్వే ప్రారంభం
కళ్యాణదుర్గం మున్సిపాలిటీ అభివృద్దే తన మంత్రాంగ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు ముందుకెళ్తున్నారు. ఇందులో భాగంగానే మున్సిపాలిటీలో అన్ని వార్డుల్లో అయన వ్యక్తిగత ఇంజినిర్లతో మున్సిపాలిటీలో సర్వే ప్రారంభించారు. ఎక్కడ సీసీ రోడ్లు అవసరం.. డ్రైనేజ్ ఎక్కడ అవసరం ఇంకా ఏమి చేస్తే మున్సిపాలిటీలో బాగుంటుంది అని పలు రకాలుగా సర్వేలు చేయిస్తున్నారు. ఈ సర్వే గత 15 రోజుల నుండి వార్డుల వారీగా సర్వే చేసి రిపోర్టు ఎమ్మెల్యే ఇస్తున్నారు. సర్వే రిపోర్ట్ మొత్తం వచ్చాక స్థానిక నాయకులతో కలిసి మున్సిపాలిటీ అభివృద్ధి కోసం కార్యాచరణ చేయనున్నారు.