సిరాన్యూస్,ఖానాపూర్ టౌన్
బడ్జెట్లో రైతులకు పెద్ద పీట వేయడం హర్షణీయం
* ఆదివాసీ కాంగ్రెస్ ఎస్టీ సెల్ చైర్మన్ బాణావత్ గోవింద నాయక్
బడ్జెట్లో రైతులకు పెద్ద పీట వేయడం హర్షణీయమని ఆదివాసీ కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ చైర్మన్ బాణావత్ గోవింద నాయక్ అన్నారు. శుక్రవారం నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గోవింద నాయక్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు, సంతృప్తి కలిగించే బడ్జెట్ అని కొనియాడారు.ఈ బడ్జెట్ రాష్ట్రంలోని అన్ని కులాలకు అతీతంగా ఉండడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వానికి, సీఎం రేవంత్ రెడ్డి కి, శుభాకాంక్షలు తెలిపారు.