సిరాన్యూస్,ఓదెల
నేత్రదాతకు ఐలు లక్ష్మి సంస్మరణ సభ
పెద్దపల్లి జిల్లా ఓదెల నివాసి నేత్రదాత ఐలు లక్ష్మి సంస్మరణ సభను వారి స్వగృహంలో సదాశయ ఫౌండేషన్ ఓదెల మండల అధ్యక్షుడు డాక్టర్ కోండ్ర వేణు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈసందర్భంగా వచ్చిన బంధు మిత్రులకు నేత్ర అవయవ శరీర దానాలపై అవగాహన కల్పించారు. అలాగే జ్ఞాపిక ను కుటుంబానికి అందజేసి అభినందనలు ధన్యవాదాలు తెలిపారు. ఇద్దరు అంధులకు చూపును ప్రసాదించిన కుమారులు కోడండ్లు శ్రీనివాస్-రాజేశ్వరి, స్వామి-గీత కుమార్తెలు అల్లుండ్లు,శాంత-. చంద్రయ్య, శ్యామల-రవీందర్, లావణ్య-రవీందర్‌కు సదాశయ ఫౌండేషన్ జాతీయ అధ్యక్షులు శ్రవణ్ కుమార్ ప్రధాన కార్యదర్శి లింగమూర్తి జాతీయ కార్యదర్శి డాక్టర్ భీష్మాచారి,క్యాతం మల్లేశం, అభినందనలు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో గోపతీ తిరుపతి, అప్పనీ తిరుపతి , నాగపూరి, రవి తదితరులు ఉన్నారు.