సిరా న్యూస్, సైదాపూర్:
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల అందజేత: కాంగ్రెస్ మండల అధ్యక్షుడు దొంత సుధాకర్
సైదాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో లబ్దిదారులు తాళ్లపల్లి రామచంద్రం, కనకం సంజీవ్‌లకు మండల పార్టీ అధ్యక్షుడు దొంత సుధాకర్ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను సోమవారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్థికంగా వెనుకబడిన పేద ప్రజల కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి మేకల రవీందర్, గ్రామశాఖ అధ్యక్షులు గొల్లపల్లి యాదగిరి, వెల్ది రాజు, గుంటి స్వామి, నవీన్ గౌడ్, మేకల రాజు, బొమ్మగాని రాజు, తాళ్లపల్లి సమ్మయ్య, పూసల ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.