సిరా న్యూస్,పెడన;
పెడన మండలం నడుపూరుగ్రామంలో చిగిలి శెట్టి అర్జున్ రావు జనసేన క్రియాశీలక సభ్యత్వం తీసుకున్నారు. జనసేన కార్యకర్తకి ప్రమాదవశాత్తు పొలం వెళ్లి తిరిగి వస్తుండగా హైవే రోడ్డుపై మోటార్ సైకిల్ గుద్దడంతో కాలు విరగడంతో హాస్పిటల్లో జాయిన్ చేసి వైద్యం చేయించారు. విషయం తెలుసుకున్న పార్టీ అధిష్టానం వెంటనే స్పందించి, అర్జున్ రావు వైద్య ఖర్చుల నిమిత్తం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ద్వారా 50వేల రూపాయల చెక్కును పెడన నియోజకవర్గ సమన్వయకర్త పంచకర్ల సురేష్ అందజేశారు.
ఈ సందర్భంగా సురేష్ మాట్లాడుతూ జనసేన పార్టీ కోసం పనిచేసే ప్రతి కార్యకర్తకి పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు