సిరాన్యూస్, కళ్యాణ్ దుర్గం
అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు: ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు
మున్సిపల్ అధికారులు పై ఆగ్రహం
లే అవుట్లలో అధికారులు అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర హెచ్చరించారు. మంగళవారం అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ అధికారులతో ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అవినీతి, నిధులు స్వాహా లపై అధికారులను ఎమ్మెల్యే అరాతీశారు. కొత్త లే అవుట్ల కు పర్మిషన్ ఇవ్వాలంటే ముందుగా నామ్స్ ప్రకారం డ్రైన్ కాలువలు, విద్యుత్ స్తంభాలు. మున్సిపాలిటీ అభివృద్ధి కోసం ప్రభుత్వానికి స్థలాన్ని కేటాయిస్తేనే అప్రూవల్ ఇవ్వాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. డబ్బుకు అమ్ముడు పోయి అక్రమార్కులు చెప్పినట్లు చేసినట్లు తమ దృష్టి వస్తే అవినీతి అధికారుల పై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు .మున్సిపాలిటిలో సమస్యలు,పారిశుధ్యం, రోడ్లు అధ్వాన్యంగా పై మున్సిపల్ అధికారుల పై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. సంబంధిత అభివృద్ధి పనుల చేపట్టేందుకు నివేదికలు సిద్ధం చేయాలని అధికారులకు ఎమ్మెల్యే ఆదేశించారు సమీక్ష సమావేశానికి మున్సిపల్ అధికారులు, కౌన్సిలర్లు,పార్టీ నాయకులు, కార్యకర్తలు, సిబ్బంది పాల్గొన్నారు.