సిరాన్యూస్, కళ్యాణ్ దుర్గం
కబ్జాదారులపై కఠిన చర్యలు తీసుకుంటాం : ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు
కబ్జాదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు అన్నారు. సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. కళ్యాణదుర్గం ప్రాంతంలో ప్రజాసంఘలు నాయకుల ముసుగులో పేదలకు అందించిన స్థలాలలో ప్రజలకు ఇబ్బందులు కలిగించిన సెటిల్మెంట్ల రూపంలో డబ్బులు వసూలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. ప్రజలను ఆందోళనకు భయభ్రాంతులకు గురిచేస్తున్నారని చెప్పారు. గత నాయకుల అండ దండాలతో వసూళ్లకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.పేదల స్థలాలలో ఒక్కొక్క వ్యక్తి నాలుగు ఐదు బిల్డింగులు నిర్మించుకున్నారని తమ దృష్టికి వచ్చిందని, ఇకమీదట కబ్జాలను ఆపివేయాలని హెచ్చరించారు. ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తే సహించేది లేదన్నారు.