సిరాన్యూస్, సైదాపూర్
రైతు ప్రయోజనాలే కాంగ్రెస్ లక్ష్యం: కాంగ్రెస్ మండల అధ్యక్షుడు దొంత సుధాకర్
రైతు ప్రయోజనాలే కాంగ్రెస్ ప్రభుత్వ ముఖ్య లక్ష్యమని కాంగ్రెస్ మండల అధ్యక్షుడు దొంత సుధాకర్ అన్నారు. మంగళవారం సైదాపూర్ మండల కేంద్రంలోని రైతువేదికలో రెండో విడత రుణమాఫీ సమావేశ కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన మాట ప్రకారం రైతు రుణమాఫీ రెండో విడత నిధులు సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం విడుదల చేశారని తెలిపారు. రెండోవిడత రుణమాఫీలో భాగంగా కరీంనగర్ జిల్లాలో 21వేల785మంది రైతులకు 207 కోట్లు విడుదల విడుదల చేసినట్లు మండల అధికారులు, ప్రజాప్రతినిధులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అగ్రికల్చర్ ఏఈఓ లు రజిత, రాజు, నిఖిల్, సింగల్ విండో డైరెక్టర్ రాజు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.