సిరా న్యూస్,హైదరాబాద్;
పుట్టిన గడ్డను మారువకుండా సేవ కార్యక్రమాలను తెలంగాణ అమెరికా తెలుగు సంఘం చేస్తుందని ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అన్నారు. తెలంగాణ అమెరికా తెలుగు సంఘం ఆధ్వర్యంలో… నెక్లెస్ రోడ్ లో ఏర్పాటు చేసిన 5కె రన్ ను ఆయన జెండా ఊపి ప్రారంభించారు. పీపుల్స్ ప్లాజా నుంచి జల విహార్ నుంచి తిరిగి పీపుల్స్ ప్లాజా వరకు ఈ రన్ సాగింది. సేవా దినోత్సవాల భాగంగా… నా ఊరు-ఆ రోజుల్లో పేరిట నిర్వహించిన 5కె రన్ లో పెద్ద ఎత్తున్న యువతి, యువకులు పాల్గొన్నారు. తెలంగాణ సంస్కృతి , సంప్రదాయాలను ఖండాంతరలుకు వ్యాపింపజేసిన సంఘం ప్రతినిధులను ఆయన అభినందించారు. తెలంగాణ రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాలలో పేద ప్రజల కోసం అనేక సేవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారన్నారు. ఈ సందర్భంగా నిర్వహకులతో కలిసి జుంబా డ్యాన్స్ చేసిన సుధీర్ రెడ్డి , యువతను ఉత్తేజపరిచారు.