సిరా న్యూస్,పరవాడ
పరవాడ మండలంలో గ్రామంలో వీధి కుక్కల సంచారం ఎక్కువగా ఉండడంతో ఈ విషయంపై గ్రామ ప్రజల నుంచి పెద్ద ఎత్తున అధికారులకు ఫిర్యాదులు వస్తుడడంతో ప్రభుత్వ ఉన్నతధికారుల సూచనలతో మండలంలో గ్రామాల్లో ఉన్నటువంటి కుక్కలని పట్టుకొనే కార్యక్రమం మొదలుపెట్టారు. గ్రామస్తులు సహకారంతో రోడ్లపై తిరుగుతూ ప్రజలకు ఇబ్బందులకు గురి చేస్తున్న విధి కుక్కల్ని విశాఖపట్నంలో గల మారికవలస వద్ద ఉన్న శునకముల కూ.ని. ఫ్యామిలీ ప్లానింగ్.(స్టెయిలైజేషన్) శాస్త్ర విభాగమునకు తరలించడం జరుగుతుంది.అయ్యితే ఇంత వరకు బాగానే ఉన్న కుక్కలని పట్టుకొనే విధానం పై ప్రజలు నుంచి విమర్శలు వస్తున్నాయి.గ్రామంలో ఏదో ఒక ప్రదేశంలో కుక్కలని పట్టి మిగతా ఏరియాలో పట్టకపోవడం కుక్కల సంచారం గ్రామ వీధిల్లో అలాగే కనిపిస్తూడడంతో గతంకీ ఇప్పటికి తేడా లేకపోవడంతో పంచాయతీ అధికారులు ప్రజా సమస్యలుపై చిద్ద శుద్ధితో పని చెయ్యడం లేదని ఉన్నాతిధికారుల మెప్పు కోసమే పాకులాడుతున్నారని ఆయా గ్రామాల ప్రజానీకం అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.మండల కేంద్రం అయ్యిన పరవాడలో వీధి వీధికీ పదుల సంఖ్యలో కుక్కలు రాత్రిలు పగలు అనే తేడాలేకుండా విహారిస్తున్నాయి మార్గమధ్యలో అటుగా నడక సాగిస్తున్న చిన్న పెద్ద అనే తేడా లేకుండా విరుచుకుపడుతున్నాయి.అధికారులు ఇప్పటికి అయ్యిన దృష్టి పెట్టి ప్రజా సమస్యను తీర్చే విధంగా చర్యలు తీసుకొంటారని ఆశిస్తున్నారు.