సిరాన్యూస్, ఖానాపూర్ టౌన్
ఖానాపూర్ మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలలో ఘనంగా వన మహోత్సవం
మిమ్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణం లోని హైటెక్ కాలనీ లో గల మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాల (టీ ఏం ఆర్ ఈ ఐ ఎస్)లో గురువారం ఘనంగా వన మహోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో విద్యార్థులు, ఉపాధ్యాయులు నాయకులు, అధికారులు మున్సిపల్ సిబ్బంది కలిసి సుమారు 300 మొక్కలు నాటారు. ఈసందర్బంగా నాయకులు షబ్బిర్ పాషా మాట్లాడారు. ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని, నాటిన మొక్కలను పెంచడం లో ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకోవాలన్నారు. చెట్లను పెంచడం ద్వారా ప్రకృతిలో ఆహ్లాదకరమైన వాతావరణం, స్వచ్ఛమైన గాలి తో పాటు ఆక్సీజన్, నీడ తో పాటు ఎన్నో విధాలుగా జీవ జాతికి మేలు చేస్తాయని అన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ టి. మనోహర్ స్థానిక నాయకులు షబ్బిర్ పాషా,పాఠశాల ప్రిన్సిపల్ సత్యం, ఉపాధ్యాయులు సలీం,పర్వేజ్, అఫ్సర్, రమేష్, అసిఫ్,మున్సిపల్ సిబ్బంది చేతన్, ఫెరోజ్, వార్డ్ ఆఫీసర్ సంతోష్, శ్రీనివాస్ మెప్మా నారాయణ,తదితరులు పాల్గొన్నారు.