సిరాన్యూస్, సైదాపూర్:
“పచ్చకామెర్లతో” మారుపాక అర్జున్ మృతి
పచ్చకామెర్ల వ్యాధితో యువకుడు మృతి చెందిన ఘటన సైదాపూర్ మండలం వెన్నంపల్లి గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. మండలంలోని వెన్నంపల్లి గ్రామంలో నివాసం ఉంటున్న మారుపాక అర్జున్ పదవ తరగతి పూర్తిచేశాడు. చిన్నతనంలోనే తండ్రి మరణించడంతో అర్జున్, తన సోదరుడు మారుపాక శంకర్ ప్రతిరోజు కూలిపని చేస్తూ తన తల్లిని పోషించుకునే వారు. బుధవారం ఉదయం తీవ్ర అస్వస్థకు గురి కావడంతో స్థానికులు అంబులెన్స్ సమాచారం అందించదంతో కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గురువారం ఉదయం చికిత్స పొందుతూ మృతి చెందినట్లు డాక్టర్లు ధృవీకరించారు. చేతికి అందివచ్చిన కుమారుడు మరణించడంతో తల్లి, అన్న, కుటుంబ సభ్యులు, బంధువులు, మిత్రులు శోకసంద్రంలో మునిగిపోయారు.