సిరాన్యూస్, ఆదిలాబాద్
సత్వర న్యాయసాయం కోసమే అదాలత్: న్యాయమూర్తి దుర్గా రాణి
* ఆదిలాబాద్ జైలులో అదాలత్
ఖైదీలకు సత్వర న్యాయసాయం అందించేందుకు ఆదిలాబాద్ జిల్లా జైలులో అదాలత్ నిర్వహించినట్లు న్యాయమూర్తి దుర్గా రాణి అన్నారు. శనివారం ఆదిలాబాద్ జిల్లా కేంద్ర కారాగారంలో జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జైల్ అదాలత్ నిర్వహించారు. ఈ సందర్భంగా నలుగురు ఖైదీలకు సంబంధించి నాలుగు కేసులను పరిష్కరించారు. ఈసందర్బంగా న్యాయమూర్తి దుర్గా రాణి మాట్లాడుతూ ఖైదీలకు సత్వర న్యాయసాయం అందించేందుకు ఏర్పాటు చేస్తున్న జైల్ అదాలత్ ఖైదీలకు ఎంతగానో దోహదపడుతుందన్నారు. ఈ అదాలత్లో లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్స్ దాసరి గంగారాం,అరుగుల అశోక్ ,ఉమేష్ రావు డోలే , న్యాయసాయం అందజేయగా జైల్ పర్యవేక్షణాధికారి అశోక్, డిప్యూటీ పర్యవేక్షణాధికారులు జయప్రకాష్ రెడ్డి, సిబ్బంది శశికళ, భాస్కర్, రవీందర్,శ్రావ్య, శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.
