సిరా న్యూస్,డిచ్ పల్లి;
నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండలం ధర్మారం ( బి)గ్రామ దళితులు ఎస్సీ వర్గీకరణకు సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడాన్ని హర్శిస్తూ దళిత దళపతి మందకృష్ణ మాదిగకు పాలాభిషేకం చేశారు.. ఒక్కరికి ఒకరు మిఠాయిలు తినిపించుకొని సంబరాలు చేసుకున్నారు.. గ్రామపంచాయతీ ఆవరణలో ఉన్న అంబేద్కర్ బాబు జగ్జీవన్ రావు విగ్రహాలకు పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.. 50 ఏళ్ల పోరాటం ఫలించిందని ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సేమ్ రేవంత్ రెడ్డి ప్రకటించడం తమక ఎంతో సంతోషదాయకంగా ఉందని పేర్కొన్నారు గ్రామ దళిత పెద్దలు ఆదాము, సోమనాథ్,ఎల్లయ్య యువకులు పాల్గొన్నారు.