సిరా న్యూస్, బేల
క్యాన్సర్ బాధితురాలికి రక్తదానం చేసిన యువకుడు ఫైయిమ్
* సామ రూపేష్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన కుటుంబ సభ్యులు
గత కొన్ని రోజులుగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని మశాల బి గ్రామానికి చెందిన అడేళ్ల బాయి అనే మహిళకు ఆదిలాబాద్ యువకుడు రక్తదానం చేశారు.ఆదిలాబాద్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో చికిత్స కోసం వచ్చిన బాధితురాలికి వైద్యులు బి పాజిటివ్ రక్తం అవసరమని కుటుంబ సభ్యులకు సూచించారు.వెంటనే వారు అదిలాబాద్ యువజన కాంగ్రెస్ అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి సామ రూపేష్ రెడ్డిని సంప్రదించగా ఆయన వెంటనే ఆదిలాబాద్ పట్టణంలోని చిలుకూరి లక్ష్మి నగర్ కాలనికి చెందిన ఫైయిమ్ అనే యువకుడితో ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రి బ్లడ్ బ్యాంకులో రక్తదానం చేయించారు.దీంతో అత్యవసర సమయంలో స్పందించిన సామ రుపేష్ రెడ్డి తో పాటు యువకుడికి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.