సిరాన్యూస్, బోధ్
సాయినగర్‌లో తాత్కాలిక రేషన్ షాపు ఏర్పాటు
ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండల కేంద్రానికి దాదాపు రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న సాయి నగర్ కాలనీవాసులకు రేషన్ బియ్యం బోథ్ నుండి తీసుకురావాలంటే ఇబ్బందులకు గురయ్యేవారు. అయితే తమ గోడు ను ఇటీవల జిల్లా కలెక్టర్‌కు విన్నవించడంతో షాప్ నెంబర్ 2 నుండి సాయి నగర్ కాలనీలో బియ్యాన్ని పంపిణీ చేయాలని ఆదేశించారు. దీంతో శనివారం నుండి తాత్కాలిక షాపులో బియ్యం సరఫరా చేస్తున్నారు. అయితే మూడు రోజుల్లోగా బియ్యం తీసుకువెళ్లాలని లబ్ధిదారులకు అధికారులు సూచించారు.అయితే కాలనీవాసులు మాత్రం తమకు పర్మినెంట్‌గా రేషన్ షాప్ ను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.