సిరా న్యూస్, ఓదెల
చిరంజీవి కుటుంబానికి 50కేజీల బియ్యం అందజేత: ధర్మకర్త డాక్టర్ సతీష్
పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రానికి చెందిన నిరుపేద కుటుంబానికి చెందిన బూసారపు చిరంజీవి ఆటో నడుపుకుంటూ జీవనాన్ని కొనసాగిస్తున్నాడు. ఇటీవల అనారోగ్యంతో బూసారపు చిరంజీవి కరీంనగర్ ఆసుపత్రిలో మృతిచెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు ఆడపిల్లలు శరణ్య(8) అరణ్య(5) ఉన్నారు. ఈ విషయం తెలుసుకున్న ఓదెల మల్లికార్జునస్వామి దేవస్థానం ధర్మకర్త డాక్టర్ సతీష్ శనివారం బాధిత కుటుంబానికి 50కేజీ ల బియ్యాన్ని అందజేశారు. భవిష్యత్తులో కుటుంబానికి తనకు తోచిన సాయం చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో చింతం మొగిలి, బోగె సదానందం, కోటగిరి స్వామి.,నాగపురి పైడి రాజు శ్రీపతి మహేశ్, మార్క రమేష్,పోతుగంటి.వెంకటేష్,అనిల్ తదితరులు పాల్గొన్నారు.