సిరా న్యూస్, ఇచ్చోడ
బదిలీపై వెళ్తున్న వైద్యాధికారి ఆకుదారి సాగర్‌కు ఘన సన్మానం
ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో విధులు నిర్వహించి బదిలీపై వెళ్లడం బాధాకరంగా ఉందని మండలం వైద్యాధికారి ఆకుదారి సాగర్ అన్నారు. శుక్రవారం మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారి ఆకుదారి సాగర్‌కు వీడ్కోలు సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విధి నిర్వహణలో సిబ్బంది తనకు ఎంతో సహకరించారని గుర్తు చేశారు. తను ఎక్కడున్నా కలుపుగొలుపు జ్ఞాపకాలు గుర్తుకొస్తాయని, విధుల్లో ఒకరికొకరు తప్పనిసరిగా సహకరించు కోవాలని సూచించారు. ఇచ్చోడ జీవితంలో మర్చిపోలేని ఎన్నో జ్ఞాపకాలను తనకు అందించిందని పేర్కొన్నారు. ఇచ్చోడలో చాలా సంవత్సరాలుగా పనిచేసి ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని (డిఎల్ఓ) జిల్లా లెప్రసి కార్యాలయానికి బదిలీపై వెళ్తున్నానని తెలిపారు. అనంతరం స్థానిక వైద్య సిబ్బంది ఆయనను శాలువతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది పాల్గొన్నారు.