సిరా న్యూస్, ఓదెల
నేత్రదాత బుస్సారపు చిరంజీవి సంస్మరణ సభ
పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రానికి చెందిన నేత్రదాత బుస్సారపు చిరంజీవి సంస్మరణ సభను శనివారం సదాశయ ఫౌండేషన్ ఓదెల మండల అధ్యక్షుడు డాక్టర్ కోండ్ర వేణు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా బంధు మిత్రులకు క్యాతం మల్లేశం నేత్ర, అవయవ, శరీర దానాలపై అవగాహన కల్పించారు. ఇద్దరు అంధులకు చూపును ప్రసాదించిన తల్లి తండ్రులు భారత, కనకయ్య భార్య దివ్య కూతుర్లు శరణ్యం,అరణ్య. భూసారపు రాజు కు జ్ఞాపికను అందజేసి ధన్యవాదాలు తెలిపారు.అలాగే సమాజహితం కోరి నేత్రదానం చేసిన కుటుంబానికి సదాశయ ఫౌండేషన్ జాతీయ అధ్యక్షులు శ్రవణ్ కుమార్ ప్రధాన కార్యదర్శి లింగమూర్తి జాతీయ కార్యదర్శి డాక్టర్ భీష్మాచారి,ముఖ్య సలహాదారులు నూక రమేష్, గౌరవ అధ్యక్షుడు రామకృష్ణా రెడ్డి,ప్రచారం కార్యదర్శి వాసు, పృథ్విరాజ్ అభినందనలు ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో కోండ్ర వేణు, క్యాతం మల్లేశం తదితరులు పాల్గొన్నారు.